: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.31వేల కోట్లతో బంపర్ బొనాంజా.. ప్రకటించిన కేంద్రం!
ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగ ఉద్యోగులకు కేంద్రం బంపర్ బొనాంజా ప్రకటించింది. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ఇతర అలవెన్స్‌ల కోసం ఏకంగా రూ.30,748 కోట్లు ప్రకటించింది. ఏడో వేతన సంఘం ప్రతిపాదనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 48 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో రక్షణ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఉన్నారు. అలాగే రక్షణ సిబ్బంది సియాచిన్ అలవెన్స్‌లు రెండింతలు కంటే ఎక్కువ అయింది. ప్రస్తుతం రూ.14 వేలు ఉన్న సైనికుల అలవెన్స్ ఏకంగా రూ.30 వేలకు చేరుకుంది. రూ.21 వేలున్న అధికారుల అలవెన్స్ రూ.42,500కు చేరుకుంది. పెరిగిన అలవెన్స్‌లు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.