: కుకునూరుపల్లి ఎస్పై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై కేసు నమోదు


కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్వేల్ ఏసీపీ గిరిధర్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభాకర్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు 306 సెక్షన్ కింద కుకునూరుపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి మృతి తర్వాత గిరిధర్ ఒక్కడే క్వార్టర్స్ కి వెళ్లి విలువైన వస్తువులు మాయం చేశాడని భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏడీజీ, ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిసిన ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు వ్యవహారంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News