: మంత్రి అయ్యన్నపాత్రుడికి ఊహించని చేదు అనుభవం


ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడికి గుంటూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆహ్వానం మేరకు అయ్యన్నపాత్రుడు పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కాన్వాయ్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇంటి రుణాల మంజూరుకు కిషోర్ బాబు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆరోపించారు. టీడీపీ వ్యక్తులను కాదని వైసీపీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అయ్యన్న ఇబ్బందికి గురయ్యారు. అనంతరం పోలీసుల సహాయంతో కాన్వాయ్ ముందుకు సాగింది. 

  • Loading...

More Telugu News