: డీజే ‘గుడిలో బ‌డిలో’ పాట‌కి కోటిన్నర వ్యూస్‌... మా చ‌రిత్ర‌లోనే అత్య‌ధికం: ఆదిత్య మ్యూజిక్


స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్, అందాల భామ పూజా హెగ్డే న‌టించిన‌ ‘డీజే: దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ‘గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో’ పాట ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఇందులో వాడిన ప‌దాల‌పై బ్రాహ్మ‌ణ సంఘాల సభ్యులు అభ్యంత‌రాలు తెలుపడం, వివాదం రేగడంతో ఈ పాట‌కు మ‌రింత పబ్లిసిటీ వ‌చ్చింది. ఇందులో బ‌న్నీ, పూజా హెగ్డేల డ్యాన్స్ ఒక‌రిపై ఒక‌రు పోటీప‌డి చేశారా? అన్న‌ట్లు ఉంది. దీంతో ఈ పాట యూ ట్యూబ్‌లో అత్య‌ధిక క్లిక్స్‌తో దూసుకుపోతోంది. ఈ పాట‌కి ఇప్ప‌టివ‌ర‌కు కోటిన్నర వ్యూస్‌ వ‌చ్చాయ‌ని ఈ రోజు ఆదిత్య మ్యూజిక్ ప్ర‌క‌టించింది. త‌మ యూట్యూబ్ ఛానెల్ చరిత్ర‌లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన వీడియోగా ఇది నిలిచింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. 

  • Loading...

More Telugu News