: ఫేస్ బుక్ లో ‘డీజే’ సినిమా... పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు


యువ క‌థానాయ‌కుడు అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘డీజే: దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ప‌లు కీల‌క సీన్లు ఆన్‌లైన్‌లో ఎంత‌గా హ‌ల్‌చ‌ల్ చేశాయో తెలిసిందే. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హ‌రీశ్ శంక‌ర్ తాము పోలీసుల‌కి ఫిర్యాదు చేస్తామ‌ని ఇటీవ‌లే హెచ్చ‌రించారు. ఈ రోజు నిర్మాత దిల్‌రాజుతో క‌లిసి హ‌రీశ్ శంక‌ర్‌ హైద‌రాబాద్‌లో సైబ‌ర్ క్రైం పోలీసుల‌కి ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా ప‌లు సోష‌ల్ మీడియా సైట్ల‌లో త‌మ సినిమాలోని సీన్లను లీక్ చేసిన వారిపై వారు ఫిర్యాదు చేశారు. కొందరు సినిమా మొత్తాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని చెప్పారు. ఫిర్యాదు స్వీక‌రించిన సైబ‌ర్ క్రైం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతామ‌ని చెప్పారు.

 కాగా, డీజేలోని ప‌లు కామెడీ సీన్లు, అల్లు అర్జున్‌, పూజా హెగ్డేల మ‌ధ్య రొమాన్స్ సీన్లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. సినిమా విడుద‌లైన రోజు నుంచే ‘డీజే’ సీన్లు బ‌య‌ట‌కు రావ‌డం ప‌ట్ల సినిమా యూనిట్ సీరియ‌స్ అయింది. తాజాగా ఫేస్ బుక్ లో ఆ సినిమా మొత్తాన్ని పోస్ట్ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News