: '2.0' కోసం ఆకాశ ప్రచారం... వాతావరణం వైపు చూస్తున్న నిర్మాతలు!


2010లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న '2.0' ప్రచారాన్ని వినూత్నంగా చేయాలని ప్లాన్ చేసిన నిర్మాతలకు వాతావరణం అడ్డుపడుతోంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న చిత్రం ప్రచారాన్ని భారీ హాట్ ఎయిర్ బెలూన్లను ఆకాశంలోకి పంపి వాటిని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించేలా చూడాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలు వారి ప్రయత్నాలకు అడ్డుగా నిలిచాయి. ఇక ఈ హాట్ ఎయిర్ బెలూన్ల చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న నిర్మాత రాజు మహాలింగం, వీటి టెస్ట్ రైడ్ పూర్తయిందని, వాతావరణం ఎప్పుడు బాగుపడుతుందా? అని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News