: అమితాబ్ జీ!...రాజకీయాల్లోకి వెళ్లొచ్చంటారా?: సలహా కోరనున్న రజనీకాంత్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తున్న సమయంలో తమిళనాట ఆసక్తికర వార్త ఒకటి వెలుగు చూసింది. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్ ఇప్పటికే జ్యోతిష్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను సంప్రదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ను రజనీ త్వరలోనే కలవనున్నారని తెలుస్తోంది.
రాజకీయాల్లోకి రావడం శ్రేయస్కరమా? లేదా? అన్న వివరాలను ఆయన వద్ద చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రజనీ గతంలో అమితాబ్ తో కలిసి అంధా కానూన్, గిరఫ్ తార్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో అమితాబ్ సలహా కోరనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఆయన ఇద్దరు కుమార్తెలకు ఇష్టం లేనట్టు చెప్పుకుంటున్నారు.