: రెండున్నర కోట్లు తీసుకుని బిగ్ బాస్ హౌస్ లోకా?... అంతా అబద్ధమేనన్న పోసాని
హిందీలో విజయవంతమై, ఆపై తమిళంలో ప్రేక్షకాదరణ కరవైన 'బిగ్ బాస్'షో తెలుగులోనూ రానున్న వేళ, తాను రూ. 2.5 కోట్ల పారితోషికం తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు వచ్చిన వార్తలపై నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా రానున్న కార్యక్రమంలో తాను భాగం కానున్నట్టు వచ్చిన వార్తలు శుద్ధ అబద్ధమని తెలిపారు. ఈ వార్తల్లో నిజం లేదని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని వ్యాఖ్యానించాడు. సదరు షో నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేసిన ఆయన, ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలియడం లేదని చెప్పాడు.