: తమిళ వర్ధమాన హాస్య నటుడి డబ్బు, నగలు దోచుకున్న హిజ్రాలు
తమిళ చిత్రాల్లో హాస్య నటుడిగా రాణిస్తున్న కొట్టాచ్చి తన పుట్టిన రోజు నాడు దారిదోపిడీకి గురయ్యాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు బయలు దేరిన ఆయన, ఓ ఆటో ఎక్కగా, హిజ్రాలు అతనిపై దాడి చేసి బంగారం, డబ్బు, ఏటీఎం కార్డు లాక్కొని రోడ్డుపైకి తోసేసి పరారయ్యారు. సురమంగళం పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, రాత్రి 1.45 గంటల సమయంలో సేలం చేరుకున్న ఆయన, ఆటో ఎక్కగా, కొంత దూరం తరువాత ఇద్దరు హిజ్రాలు అదే ఆటో ఎక్కారు. సురమంగళం ప్రాంతానికి చేరుకున్న తరువాత అతనిపై ఆటో డ్రైవర్, హిజ్రాలు దాడికి దిగారు. దాడి తరువాత సమీపంలోనే ఉన్న మరో కమేడియన్ బెంజిమన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొట్టాచ్చి. సేలం వచ్చే వరకే కొట్టాచ్చి మద్యం తాగి ఉన్నాడని, ఆటో డ్రైవర్ ఎవరన్న విషయాన్ని గుర్తించామని, పరారీలో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు.