: టికెట్ పై రైల్వే శాఖ ముద్రించిన సమాచారం చదివి.. 950కు చెక్కు పంపిన ప్రయాణికుడు!


 రైలు ప్రయాణంలో ప్రభుత్వం భరించిన రాయితీ (సబ్సిడీ) ని చెల్లించేందుకు ఒక ప్రయాణికుడు ఐఆర్సీటీసీకి 950 రూపాయల చెక్కు పంపిన ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ప్రతి ప్రయాణికుడిపై 43 శాతాన్ని రాయతీ రూపంలో రైల్వే శాఖ భరిస్తోంది. దీంతో ప్రతి ఏటా రైల్వేలకు 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందంటూ ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని టికెట్ పై ముద్రిస్తోంది.

దీనిని చదివిన ప్రయాణికుడు రాయితీ తనకు అవసరం లేదని, ప్రభుత్వం తన టికెట్ ధరపై భరించిన 43 శాతానికి చెక్కుపంపుతున్నానని పేర్కొంటూ, ఢిల్లీలోని ఐఆర్సీటీసీ కార్యాలయానికి 950 రూపాయల చెక్కు పంపించాడు. అయితే నిబంధనల ప్రకారం ఇలాంటి చెక్కులు స్వీకరించేందుకు లేకపోవడంతో ఈ చెక్కును తిప్పిపంపుతామని రైల్వే శాఖ సీనియర్ అధికారి తెలిపారు. 

  • Loading...

More Telugu News