: 'పోలవరం' విషయంలో కూడా వైసీపీ ఇదే కుట్ర చేసింది: మంత్రి సోమిరెడ్డి
కుట్రలు చేసి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, 'పోలవరం' విషయంలో కూడా ఇదే కుట్రను చేసిందంటూ వైసీపీ నేతలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని రావడం వైసీపీకి ఇష్టం లేదని, రైతుల పేరిట ప్రపంచ బ్యాంక్ కు లేఖలు రాయిస్తోందని ఆయన ఆరోపించారు. 'పట్టిసీమ' వద్దని ప్రజల్లోకి వెళ్లి చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.