: ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీ వేసిన బీసీసీఐ


సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీనీ బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా నాయకత్వం వహిస్తారు. మిగిలిన సభ్యుల్లో సౌరవ్ గంగూలీ, టీసీ మాథ్యూ, నాబా భట్టాఛార్జీ, జై షా, అనిరుధ్ చౌదరిలు ఉన్నారు. జూన్ 26న ముంబైలో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్ లో లోథా కమిటీ సూచనలను వేగంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ కొత్త కమిటీ వీలైనంత త్వరలో సమావేశం కావాలని సూచించింది. 

  • Loading...

More Telugu News