: టీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు: జీవన్ రెడ్డి
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల వైఖరితో పోలీసు ఆధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణం తర్వాత అతని కుటుంబీకులు శాంతియుతంగా ధర్నాకు దిగితే, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎమర్జెన్సీ కొనసాగుతోందని... గజ్వేల్ నియోజకవర్గాన్ని చూస్తే చాలు, తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతోందో అర్థమవుతుందని అన్నారు. కుకునూర్ పల్లి ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిల మరణం పట్ల జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శిరీష మరణానికి, ప్రభాకర్ రెడ్డి మరణానికి లింక్ పెట్టడం దారుణమని అన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని... లేకపోతే టీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపినట్టు భావించాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ నియంత తరహాలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.