: టీ20లోనూ అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ!


ఈ రోజు ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 799 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో ఇప్ప‌టికే కోహ్లీ నెం.1 స్థానాన్ని దక్కించుకున్న విష‌యం తెలిసిందే. టీ20లో కోహ్లీ త‌రువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఉన్నారు. ఇక 4, 5వ స్థానాల‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్, ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఉన్నారు.
 
టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ జాబితాలో మొద‌టి స్థానాల్లో నిలిచిన క్రికెట‌ర్లు
  • 780 పాయింట్లతో ఇమాద్ వసీమ్ (పాకిస్థాన్) నెం.1
  • 764 పాయింట్ల‌తో జస్‌ప్రీత్ బుమ్రా(భారత్ ఫాస్ట్ బౌలర్) నెం.2
  • 744 పాయింట్ల‌తో  దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ నెం.3
  • 717 పాయింట్ల‌తో అఫ్గానిస్థాన్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ నెం.4
  • అదే 717 పాయింట్ల‌తో వెస్టిండీస్ బౌలర్ శామ్యూల్ బద్రి త‌రువాతి స్థానంలో నిలిచాడు
 ప్ర‌స్తుతం టీమిండియా టెస్టుల్లో మొద‌టిస్థానంలో, వ‌న్డేల్లో మూడో స్థానంలో, టీ20 లో నాలుగో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News