: అవును... మానస సరోవర్‌ మార్గం బంద్‌ చేశాం: తమ సైనికుల చర్యలపై చైనా వివరణ


కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులను అడ్డుకుని చైనా దుందుడుకు చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన చైనా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర మార్గమైన సిక్కింలోని నాథూలా పాస్‌ను మూసివేసినట్టు అంగీక‌రించింది. సిక్కింలోని సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికులు గొడ‌వ‌కు దిగార‌ని, అంతేగాక ప‌లు భ‌ద్ర‌తా కార‌ణాలు ఉన్నాయ‌ని పేర్కొంది. సరిహద్దుల్లో భారత సైన్యం బంకర్లను ధ్వంసం చేసిన విష‌యంపై కూడా వివ‌ర‌ణ ఇచ్చుకుంది.

త‌మ సైనికుల‌ను భార‌త సైన్యం అడ్డుకున్న కార‌ణంగానే తాము ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగుతున్న‌ట్లు పేర్కొంది. దీంతో తాము కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు రెండో మార్గమ‌యిన నాథులా పాస్ మార్గాన్ని మూసివేసిన‌ట్లు తెలిపింది. ఈ మార్గాన్ని 2015 లో తెరిచారు. అప్ప‌టి నుంచి యాత్రికులు ఆ మార్గం గుండా వెళుతున్నారు.

  • Loading...

More Telugu News