: నేను వారం రోజుల పాటు మొబైల్ ఫోన్ ముట్టలేదు తెలుసా!: చెన్నై బ్యూటీ సమంత
చెన్నై బ్యూటీ సమంత ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాను ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఫోన్ వాడలేదని తెలిపింది. అందుకు కారణం లేకపోలేదు.. ఈ షూటింగ్ జరిగిన రంపచోడవరం అటవీ ప్రాంతంలో కనీస వసతులు ఉండవు. సెల్ ఫోన్ సిగ్నల్స్ అసలే ఉండవు. దీంతో సమంత సెల్ ఫోన్ వాడకుండా ఉండాల్సి వచ్చింది. వారం రోజుల పాటు ఫోన్ లేకుండా ఉన్నప్పటికీ తనకు అది పెద్ద బాధగా అనిపించలేదని, అయితే, ఇలా మరోసారి కూడా ఉండగలనా? అని ఆమె ట్విట్టర్ లో పేర్కొంది.