: హేమచంద్రకి, నాకు విభేదాలా?...మేమిద్దరం కలిసే పెరిగాం: సింగర్ కారుణ్య వివరణ
సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్రతో తనకు విభేదాలొచ్చాయని పేర్కొంటూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయని, అలాంటి వాటిని చూసి తాము నవ్వుకుంటామని సింగర్ కారుణ్య తెలిపాడు. హేమచంద్ర, తాను బావా, బావమరుదులమని, తామిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని అన్నాడు. తమ మధ్య విభేదాలు రావని చెప్పాడు. ఏ విషయంపైనైనా సరే తామిద్దరం మాట్లాడుకోగలమని తెలిపాడు. అలాంటి తమ మధ్య విభేదాలు పెట్టాలంటే పెట్టుకోవచ్చని చాలెంజ్ గా అన్నాడు. అయితే తమ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే సమస్య లేదని చెప్పాడు. తామిద్దరం కలిసే ఎన్నో అంశాలపై మాట్లాడుకుంటామని కారుణ్య అన్నాడు. అయితే చెత్త విషయాలు మాత్రం మాట్లాడుకోమని తెలిపాడు.