: నిలకడైన ఆట ఆనందంగా ఉంది: కిదాంబి శ్రీకాంత్
తనను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలని కిదాంబి శ్రీకాంత్ తెలిపాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి స్వస్థలానికి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ, గోపీచంద్ సహకారం మరువలేనిదని అన్నాడు. అత్యుత్తమ బ్యాడ్మింటన్ ఆడుతున్నామని చెప్పాడు. నాలుగైదేళ్ల శ్రమ తమను ఉన్నత స్థితిలో నిలబెట్టిందని తెలిపాడు. నాలుగైదు నెలలుగా మంచి ఆటతీరు నిలకడగా ప్రదర్శించడం ఆనందంగా ఉందని చెప్పాడు. నాలుగు టైటిళ్లు గెలవడం ఎవరికైనా సంతోషమేనని చెప్పాడు. బ్యాడ్మింటన్ లో భారతీయుల ప్రదర్శన విదేశీ క్రీడాకారులను ఆందోళనలో పడేస్తోందని శ్రీకాంత్ చెప్పాడు. మంచి ప్రదర్శనతో విజయాలు సాధించి నిలకడైన కెరీర్ ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.