: టెన్షన్ కు గురవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు!
వరుస సినిమా హిట్లతో మాంచి జోరు మీదున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ సక్సెస్ తో ఆయన అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే, ఇప్పుడు తారక్ అభిమానులు చాలా టెన్షన్ అనుభవిస్తున్నారట. దీనికంతా కారణం 'బిగ్ బాస్' షోనే. ఇప్పటికే తమిళంలో విలక్షణ నటుడు కమలహాసన్ హోస్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ ప్రసారమయింది. ఈ షోకు ఆశించినంత స్పందన రాలేదు. దీనికి కారణం ఈ షోలో స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు కనిపించకపోవడమే.
తెలుగు 'బిగ్ బాస్' షోకు కూడా సెలబ్రిటీల కొరత ఉంది. స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదట. ఇతర షూటింగ్ లు మానుకుని, ఈ షో కోసం చాలా రోజులు కేటాయించాల్సి రావడమే దీనికి కారణం. మరి, స్టార్ సెలబ్రిటీలు కనిపించని పక్షంలో... మన తెలుగు ప్రేక్షకులు ఈ షోను ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ ఇప్పుడు తారక్ అభిమానుల్లో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో కూడా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ షో ఎలా ఉంటుందో అనే ఆందోళనకు అభిమానులు గురవుతున్నారు.