: వైసీపీ కీలక నేతలతో భేటీ అయిన జగన్.. ప్లీనరీ ఏర్పాట్లపై చర్చ!
పార్టీ ముఖ్యనేతలతో వైసీపీ అధినేత జగన్ ఈ ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఉన్న కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. జూలై 8, 9 తేదీల్లో వైసీపీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. విజయవాడ, గుంటూరుల మధ్య ఉన్న నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఉన్న స్థలంలో ప్లీనరీని నిర్వహించనున్నారు.