: జూలై 2 తర్వాత ఎక్కడుంటానో నాకే తెలియదు.. ఇక 2019 గురించి ఏం చెబుతాను? : స్మృతీ ఇరానీ
జౌళి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ఇండియా టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌కు ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రానున్న 2019 ఎన్నికల్లో అమేథీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా... 'ఈ ఎగ్జిబిషన్ జూలై 2న ముగుస్తుంది. ఆ రోజు తర్వాత ఎక్కడ ఉంటాననే విషయమే నాకు తెలియదు, ఇక 2019 పరిస్థితి గురించి ఎలా చెప్పగలను?' అంటూ సమాధానమిచ్చారు.
టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ -- `ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి ప్రదర్శన జరగలేదు. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ మంది దేశ, విదేశీయులు ఈ ప్రదర్శనకు వస్తున్నారు. ఇది అనుకోకుండా సాధించిన విజయం` అని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఎదుర్కొన్న గట్టి ఛాలెంజ్ గురించి అడగ్గా - `ఛాలెంజ్‌ను ఛాలెంజ్‌గా కాకుండా అవకాశాలుగా తీసుకోవడం నాకు అలవాటు. అప్పుడే మనం విజయం సాధించగలం` అన్నారు. మీరు ఆదర్శంగా తీసుకునే రాజకీయ నాయకులు ఎవరు? అని ప్రశ్నించగా ప్రధాని నరేంద్రమోదీ బొమ్మను చూపించారు స్మృతి.