: ముగిసిన మోదీ అమెరికా పర్యటన.. నెదర్లాండ్స్‌కు పయనం


అమెరికాలో పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం నెదర్లాండ్స్ బయలుదేరారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన చివరిగా నెదర్లాండ్స్‌లో పర్యటించనున్నారు. కాగా, అమెరికా పర్యటన సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో ప్రధానంగా ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇప్పటికైనా సీమాంతర ఉగ్రవాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఇద్దరూ పాక్‌ను కోరారు.

అమెరికాలో చారిత్రక పర్యటన అనంతరం మోదీ నెదర్లాండ్స్ పయనమైనట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. నెదర్లాండ్స్ పర్యటనలో మోదీ ఆ దేశ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశమై ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై చర్చించనున్నారు. అలాగే డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు.

  • Loading...

More Telugu News