: ప్రేమించిన యువకుడు కాల్‌ రిసీవ్‌ చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య


కర్ణాటక, దొడ్డబళ్లాపురంలోని అంబిక నర్సింగ్‌ కళాశాలలో ఫస్టియర్‌ డిప్లొమా చదువుతున్న రజియా ఖాటూన్ (19) అనే విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అల‌జ‌డి రేపింది. నిన్న‌ సాయంత్రం ఒక ప్రైవేటు తోటలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఆమె ఉరివేసుకుంది. విష‌యాన్ని గ‌మ‌నించిన ఆ గెస్ట్‌హౌ‌స్ నిర్వాహ‌కులు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

రజియా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. అంబిక నర్సింగ్‌ కళాశాలలో త‌న‌తో పాటు చదువుకుంటున్న‌ సమీం అల్సబ్ అనే యువ‌కుడితో కొంతకాలంగా ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తోంద‌ని చెప్పారు. ఈ క్రమంలోనే వారిద్ద‌రు గెస్ట్‌హౌస్‌లో గ‌డ‌పాల‌ని అనుకున్నార‌ని, మొదట అక్క‌డ‌కు వెళ్లిన రజియా త‌న ప్రియుడికి ఫోన్‌ చేసిందని గుర్తించారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా త‌న ప్రియుడు కాల్‌ రిసీవ్‌ చేసుకోక‌పోవ‌డంతో మనస్తాపం చెందిన రజియా ఉరి వేసుకుని చ‌నిపోయింద‌ని అన్నారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.      

  • Loading...

More Telugu News