: మంత్రి అఖిల ప్రియ స్పష్టంగా చెబితే సవాల్ స్వీకరిస్తా: శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాలలో టీడీపీ ఓడిపోతే పార్టీకి రాజీనామా చేస్తానని మంత్రి అఖిల ప్రియ స్పష్టంగా చెబితే సవాల్ స్వీకరిస్తానని వైసీపీ నేత శిల్పామోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నంద్యాలలో వైసీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, భూమా కూతురు లేదా కుమారుడు పోటీ చేసి ఉంటే కనుక వైసీపీ సంప్రదాయాన్నిపాటించేదని అన్నారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ నేత, తన సోదరుడు శిల్పా చక్రపాణి మద్దతుపై తానేమీ మాట్లాడదలచుకోలేదని అన్నారు.
కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీ తరపున శిల్పామోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీ ఇటీవల ప్రకటించడం జరిగింది.