: క్రీజులో విండీస్ కెప్టెన్‌ని ఆటపట్టించిన ధోనీ.. వీడియో వైరల్


టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ వెస్టిండీస్‌ కెప్టెన్ హోల్డర్‌ను నిన్న క్రీజులోనే ఆట‌ప‌ట్టించాడు. నిన్న వెస్టిండీస్‌, టీమిండియాకు మ‌ధ్య జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త‌ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హోల్డర్ భారీ షాట్‌కి ప్రయత్నిస్తూ గీత దాటి వ‌చ్చేశాడు. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి ధోనీ చేతుల్లోకి వెళ్లింది. మ‌ళ్లీ గీత లోప‌లికి వచ్చేందుకు హోల్డ‌ర్‌ వెనక్కి తిరగగా ధోనీ వికెట్లని ఒక్క‌సారిగా కొట్టేయ‌కుండా ‘స్లో మోషన్‌’లో మెల్లిగా బంతిని వికెట్ల వ‌ద్ద‌కు తీసుకొచ్చాడు. తాను వెన‌క్కివ‌చ్చిన‌ప్ప‌టికీ లాభం లేదనుకున్న హోల్డ‌ర్ ధోనీ చేస్తోన్న త‌మాషాను గుర్తించి కనీసం బ్యాట్‌ని క్రీజులోకి ఉంచే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ స్టంపౌట్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. హోల్డ‌ర్‌ని ధోనీ టీజ్ చేశాడ‌ని క్రికెట్‌ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News