: గుండెపోటుతో మృతి చెందిన కేసీఆర్ సన్నిహితుడు దానయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆస దానయ్య గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. దానయ్యతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనే సిద్ధిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని గతంలో ఆయనకు కేసీఆర్ అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో లేరు. దానయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు సంతాపం ప్రకటించారు.