: ప్రేమలో విహరించాల్సిన వయసులో.. ఎంతో కష్టపడ్డా: నటి కంగనా రనౌత్
లవ్ లెటర్స్ రాస్తూ, ప్రేమలో విహరించాల్సిన వయసులో తాను ఎంతో కష్టపడ్డానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. చిన్న వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో, అందరి పిల్లల్లా ఆడుకునే అవకాశం కూడా తనకు దక్కలేదని చెప్పింది. టీనేజర్ గా ఉండగానే సెట్స్ లో పనిచేయాల్సి వచ్చిందని... 17 ఏళ్ల వయసులోనే బతకడానికి కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. 'అనుపమ్ ఖేర్స్ పీపుల్ షో' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను వెల్లడించింది. మొదటి నుంచి కూడా తనది తిరుగుబాటుతత్వమే అని కంగనా తెలిపింది. టీనేజ్ వయసులో మహేష్ భట్ లాంటి మేధావులతో కలసి పని చేయాల్సి వచ్చిందని... అంతటివారితో కూర్చున్నప్పుడు టీనేజ్ వయసులో ఉన్నవారికి మాట్లాడే వీలు కూడా ఉండదని చెప్పింది. ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించానని... ప్రస్తుతం స్వయంగా నిలదొక్కుకునే దశలో ఉన్నానని తెలిపింది.