: రంజాన్ రోజున అలజడి... బాదల్‌ఘర్ ఈద్గాలో మద్యం, మాంసం విసిరేసిన దుండగులు
రంజాన్ పండుగ రోజున కొందరు దుండగులు కలకలం రేపారు. ఉత్తరప్రదేశ్, అమేథీ షుకుల్ బజార్‌లోని బాదల్‌ఘర్ ఈద్గాలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మద్యం, మాంసం వేశారు. ఈ రోజు రంజాన్ కాబట్టి ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు జరిపేందుకు పెద్ద ఎత్తున ముస్లింలు వచ్చారు.
దుండగుల దుశ్చర్యను గుర్తించిన ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈద్గాను శుభ్రం చేసి ప్రార్థనలు జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. రంజాన్ రోజున మత ఘర్షణలు జరగాలనే ఉద్దేశంతోనే దుండగులు ఈ పనిచేసినట్లు అనుమానిస్తున్నారు.