: మరో కొత్త వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ ఆశ్రమం ఛైర్మన్ సూర్య ఈ రోజు ఆయనపై డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఆశ్రమ నిర్మాణాల్లో భాగంగా ఇసుక తరలింపుకు అధికారులు అనుమతి ఇచ్చినా ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆశ్రమానికి నీటి సరఫరాను కూడా ఆపేశారని తెలిపారు. తమ సంస్థపై కక్షగట్టి, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో విన్నవించారు.