: ఫేస్‌బుక్‌లో మ్యాజిక్..... 20 ఏళ్ల హ్యారీపోటర్!
బ్రిటన్ రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీపోటర్ నవల మొదటి భాగం విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ వెబ్‌సైట్‌లోకి మ్యాజిక్ తీసుకొచ్చింది. ఈ కొత్త హంగులను చూసి పోటర్ అభిమానులు మురిసిపోతున్నారు.
ఈ మ్యాజిక్‌ను చూడాలంటే `హ్యారీ పోటర్`, `గ్రిఫండర్`, `స్లిథరిన్`, `హఫుల్‌పఫ్`, `రెవెన్‌క్లా` పదాలను పోస్ట్‌లో గానీ, కామెంట్‌లో గానీ ఎంటర్ చేసినపుడు ఆయా పదాలకు సంబంధించిన రంగులోకి ఫేస్‌బుక్ వాల్ మారిపోతుంది. ఈ పదాలను క్లిక్ చేసినపుడు కూడా ఈ మ్యాజిక్ కనిపిస్తుంది.
1997 జూన్ 26న హ్యారీపోటర్ సిరీస్‌లో మొదటి నవల - 'హ్యారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్' విడుదలైంది. ఈ సిరీస్‌లో చివరి, ఆరవ నవల- 'హ్యారీపోటర్ అండ్ ది డెత్తీ హ్యాలోస్'. ఈ ఆరు నవలలను ఏడు సినిమాలుగా వార్నర్ బ్రదర్స్ సంస్థ వారు నిర్మించారు. అంతేకాకుండా ఈ నవలలకు కొనసాగింపుగా `హ్యారీపోటర్ అండ్ ది కర్స్‌డ్ చైల్డ్` అనే డ్రామాను కూడా రౌలింగ్ రచించారు.