: తిరుమలలో తప్పిపోయిన తెలంగాణ మాజీ ఎమ్మెల్యే... సర్వత్ర టెన్షన్!


తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చిన తెలంగాణ పరిధిలోని బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తప్పిపోవడం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన, దర్శనానంతరం కనిపించకుండా పోయారు. ఆయన కోసం చాలాసేపు వెతికిన కుటుంబీకులు తరువాత పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న ఆయన, గుర్తు తెలియని స్థితిలోనే తప్పిపోయారని భావిస్తున్నారు. ఆయన క్షేమంగా రావాలని బంధువులు ప్రార్థిస్తుండగా, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, కుంజా భిక్షం ఎటు వెళ్లారన్న విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నామని తిరుమల పోలీసు అధికారులు వెల్లడించారు. ఆయన ఆచూకీ ఇంకా లభించని స్థితిలో సర్వత్రా టెన్షన్ నెలకొంది. 

  • Loading...

More Telugu News