: నంద్యాల ఉపఎన్నిక: వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి ఖరారు
త్వరలో జరగనున్న నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జరిపిన చర్చల అనంతరం వైసీపీ అధినేత జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటిస్తున్నామని, అంతేకాకుండా, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగానూ ఆయన్ని నియమించామని తెలిపారు.