: జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం నా అదృష్టం: గవర్నర్ నరసింహన్
జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం, నరసింహన్ మాట్లాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడిని ప్రార్థించానని చెప్పారు.