: ‘కిదాంబి’కి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభినందనలు.. నగదు బహుమతి ప్రకటించిన బీఏఐ


ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ ‘మెట్ లైఫ్ బీఎండబ్ల్యూ వరల్డ్ సూపర్ సిరీస్’ టైటిల్ ను కైవసం చేసుకున్న తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ విజయం సాధించడం దేశానికే గర్వకారణమని మోదీ అన్నారు. ఫైనల్లో శ్రీకాంత్ ఆట తీరు అద్భుతంగా ఉందని, మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు గెలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. కాగా, తమ కొడుకు విజయంపై శ్రీకాంత్ తల్లిదండ్రులు కృష్ణ, రాధాముకుంద స్పందిస్తూ.. శ్రీకాంత్ గెలుపు తమకు సంతోషాన్ని ఇచ్చిందని, వ్యక్తిగతంగానే కాకుండా, దేశానికి పేరు తెచ్చాడని కొనియాడారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ కు బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏఐ) రూ.5 లక్షలు నగదు బహుమతి ప్రకటించింది.

  • Loading...

More Telugu News