: ‘పెళ్లి’కి సల్మాన్ చెప్పిన కొత్త నిర్వచనం!


బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఒకింటి వాడవుతాడా అని ఎదురుచూస్తున్న ఆయన అభిమానుల కోరిక మాత్రం తీరట్లేదు. ఈ నేపథ్యంలో ‘పెళ్లి’ గురించి సల్మాన్ చెప్పిన కొత్త నిర్వచనాన్ని ప్రస్తావించక తప్పదు. సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ చిత్రం రెండు రోజుల క్రితమే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ను, ‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని మీడియా ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘పెళ్లితో డబ్బు వృథా అవుతుందే తప్పా, అంతకుమించి ఏమీ ఉండదు. అసలు, నాకు ప్రేమపై నమ్మకమే లేదు. నేను నమ్మేది కేవలం అవసరాన్ని మాత్రమే. జీవితంలో మనకు ఎవరు అవసరమవుతారనేదే ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో తాను పెళ్లి చేసుకోననే విషయాన్ని సల్మాన్ చెప్పకనే చెప్పాడు.

  • Loading...

More Telugu News