: దమ్ముంటే నాపై రాయపాటి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించండి: ఐవైఆర్ సవాల్


తనకు ప్రకాశం జిల్లా దొనకొండలో ఎటువంటి భూములూ లేవని, ఈ విషయంలో తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. దమ్ముంటే రాయపాటి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలను తేల్చాలని సవాల్ విసిరారు. తనకు భూములున్నట్టు రాయపాటి మాట్లాడటం పెద్ద అబద్ధమని అన్న ఐవైఆర్, అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజం చేయాలని అనుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 500 కోట్ల నిధులిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన తెలుగుదేశం పార్టీ, ఆ హామీని విస్మరించిందని అన్నారు. గట్టిగా అడిగితే కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ముద్రగడ ఉద్యమానికి దిగిన తరువాతనే కాపులకు నామమాత్రంగా నిధులిచ్చారని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News