: హిందూపురాన్ని వదిలే ప్రశ్నే లేదు: మీడియాతో బాలయ్య


హిందూపురం నియోజకవర్గమన్నా, ఇక్కడి ప్రజలన్నా తనకెంతో ఇష్టమని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన ఆయన, షూటింగ్ కారణంగా బిజీగా ఉండటంతోనే గడచిన 8 నెలలుగా హిందూపురానికి రాలేకపోయానని తెలిపారు. అయినప్పటికీ, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి నిత్యమూ కృషి చేస్తూనే ఉన్నానని వెల్లడించారు.

తాను ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రజల సమస్యలపైనే ఆలోచిస్తుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సైతం తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. కాగా, బాలకృష్ణ హిందూపురాన్ని వదిలి మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ఇక్కడి నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News