: ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ ను అలవోకగా గెలుచుకున్న తెలుగుతేజం శ్రీకాంత్


కొద్దిసేపటి క్రితం ముగిసిన ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ 'మెట్ లైఫ్ బీఎండబ్ల్యూ వరల్డ్ సూపర్ సిరీస్' టైటిల్ ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ అలవోకగా గెలుచుకున్నాడు. ఫైనల్ లో చైనాకు చెందిన చెన్ లాంగ్ తో పోటీ పడ్డ శ్రీకాంత్, 22-20, 21-16 తేడాతో వరుస సెట్లతో విజయం సాధించాడు. తొలి సెట్ ను గెలుచుకున్న ఆనందంలో రెండో సెట్ ఆరంభంలో కొన్ని తప్పులు చేసినప్పటికీ, కాసేపటికే ఫామ్ లోకి వచ్చిన శ్రీకాంత్, ఆపై చెన్ ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. చెన్ చేసిన సర్వీస్ తప్పిదాలు శ్రీకాంత్ కు కలిసొచ్చాయి. ఈ మ్యాచ్ లో అడుగడుగునా శ్రీకాంత్ కు భారత అభిమానుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఈ విజయంతో శ్రీకాంత్ ప్రస్తుత సీజన్ లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్నట్లయింది.

  • Loading...

More Telugu News