: మానస సరోవరం బయలుదేరిన భారతీయులను అడ్డుకుని వెనక్కు పంపిన చైనా... వర్షాలే కారణం!
ప్రసిద్ధ కైలాస మానస సరోవరం యాత్రకు బయలుదేరిన తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం తన సరిహద్దుల్లోనే నిలిపివేసి వెనక్కు పంపింది. 47 మందితో కూడిన బృందం ఈ నెల 15న సిక్కిం చేరగా, షెడ్యూల్ ప్రకారం, నాలుగు రోజుల తరువాత అంటే, 19కే చైనాను దాటాల్సి వుంది. అయితే, సిచువాన్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడటం, ఈ ఘటనలో 15 మంది మృతి చెందడంతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో టిబెట్, చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో, వీరిని ముందుకు వెళ్లనిచ్చేందుకు చైనా అధికారులు అంగీకరించలేదు. ఆపై వారం రోజుల పాటు వారు వేచి వున్నా, వర్షాలు తగ్గకపోవడంతో, ప్రయాణం క్షేమకరం కాదని వారిని స్వస్థలాలకు పంపినట్టు చైనా అధికారులు వెల్లడించారు.