: ఆ గున్న ఏనుగు ఆడుకున్న ఆట ఎంతగానో అలరించింది.. చివరకు పడిపోయింది!


దక్షిణ స్వీడన్‌లోని బోరాస్‌ జూలో ఓ గున్న ఏనుగు త‌న త‌ల్లి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆట‌లాడుకున్న దృశ్యం నెటిజన్లను ఆక‌ట్టుకుంటోంది. ఆ గున్న‌ ఏనుగు దాని ముందు ఉన్న‌ కోళ్లను చూసి సంబ‌ర‌ప‌డిపోయింది. వాటి వెంట ప‌డుతూ ఆడుకుంది. ఆ కోళ్లు దానికి దొర‌క‌కుండా త‌ప్పించుకుంటున్నాయి. చుట్టూ తిరుగుతూ తిరుగుతూ చివ‌ర‌కు ఆ గున్న ఏనుగు ఒక్క‌సారిగి కింద‌ పడిపోయింది. దీంతో ఆ గున్న ఏనుగు తాను ఓడిపోయాన‌ని భావించిందేమో, నామోషీతో ఇక ఆట‌నుంచి నిష్క్ర‌మించింది. వెంటనే తన తల్లి ఏనుగు దగ్గరికి వెళ్లిపోయింది. నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో అల‌రిస్తోన్న ఈ గున్న ఏనుగు ఆట‌ను చూడండి.. 

  • Loading...

More Telugu News