: లిస్బన్ చేరుకున్న మోదీ.. కాసేపట్లో పోర్చుగల్ ప్రధానితో భేటీ!


మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోర్చుగల్ చేరుకున్నారు. లిస్బన్ లోని విమానాశ్రయంలో మోదీకి పోర్చుగల్ అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో పోర్చుగల్‌ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టాతో మోదీ సమావేశం కానున్నారు. పోర్చుగ‌ల్‌, భార‌త్ మ‌ధ్య సత్సం‌బంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ ఆయ‌న‌తో చ‌ర్చించ‌నున్నారు. ఈ రోజు రాత్రి పోర్చుగ‌ల్ ప‌ర్య‌ట‌న ముగించుకుని రేపు, ఎల్లుండి అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆ దేశ ప‌లు సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో మోదీ భేటీ అవుతారు. అనంత‌రం ఈ నెల‌ 27న నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు.      

  • Loading...

More Telugu News