: రానా హ్యాపీ.. యూ ట్యూబ్ దుమ్ముదులిపేస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ట్రైలర్


టాలీవుడ్ యంగ్ హీరో ద‌గ్గుబాటి రానా న‌టిస్తోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైల‌ర్ యూ ట్యూబ్ దుమ్ముదులిపేస్తోంది. నిన్న ఉదయం విడుద‌లైన ఈ ట్రైలర్ ఐదు గంటల్లోనే మిలియ‌న్ వ్యూస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఇక 24 గంట‌ల్లో నాలుగు మిలియ‌న్ల క్లిక్స్ సాధించి దూసుకుపోతోంది. బాహుబ‌లి-2 లాంటి సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో న‌టించిన రానా త‌న పాప్యులారిటీని మ‌రింత పెంచుకున్న విష‌యం తెలిసిందే. దానికి తోడు ఈ ట్రైల‌ర్‌లో రానా చెబుతున్న డైలాగులు, ఆయ‌న క‌న‌ప‌డుతున్న స్టైల్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. త‌మ మూవీ ట్రైలర్ అప్పుడే నాలుగు మిలియ‌న్ల క్లిక్స్ సాధించినందుకుగానూ రానా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాడు.   

  • Loading...

More Telugu News