: 6 వేల మందిని తొలగించనున్న ఐటీ దిగ్గజం విప్రో.. ప్రభుత్వంతో మొరపెట్టుకున్న ఐటీ ఉద్యోగుల యూనియన్


ఈ నెలాఖరులోపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో అడుగులు వేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో , కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గేను ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కలిశారు. ఐటీ కంపెనీలు అక్రమంగా చేపడుతున్న ఉద్యోగుల తొలగింపుపై ఆమెకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఐటీ కంపెనీల పనితీరుపై కూడా ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా... కేవలం టార్గెట్లను ఛేదించడమే లక్ష్యంగా కంపెనీలు పని చేస్తున్నాయని... మిడిల్ లెవెల్ మేనేజర్ల ద్వారా జూనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News