: రేపటి నుంచే టీవీలో కమల్ బిగ్ బాస్ షో ప్రసారం!


హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హాస‌న్‌, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమిళంలో ఈ షో రేపటి నుంచే ప్రసారం కానుంది. ఈ షోలో 14 మంది పాల్గొంటున్నారు. ఈ షో కోసం వేసిన‌ సెట్టింగ్ అద్భుతంగా ఉంది. ఇందులో పాల్గొన‌నున్న వారంతా 100 రోజులపాటు విజయ్ టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన వ‌స‌తిగృహాల్లోనే ఉండ‌నున్నారు. నిన్ననే ఈ షోలో పాల్గొనే వారు అక్క‌డ‌కు చేరుకున్నారు. ఈ రియాలిటీ షో ఎలా ఉంటుందనే వివరాలని ఆ షో నిర్వాహ‌కులు మీడియాకు చూపించారు.     

  • Loading...

More Telugu News