: థియేటర్ వద్ద ‘ట్యూబ్‌లైట్’ సినిమా టికెట్లు అమ్మిన మంత్రి... విమర్శలు
మంత్రి పదవిలో ఉన్న నేత సినిమా టికెట్లు అమ్మిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ నిన్న సాగర్ జిల్లా గర్హకోట ప్రాంతంలోని సొంత సినిమా థియేటర్‌లో టికెట్లు అమ్మారు. ఆయన టిక్కెట్లు అమ్ముతుండగా ఆయన మద్దతుదారులు కొందరు ఫొటోలు తీశారు. మధ్య ప్రదేశ్‌లో ఓ వైపు రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు అధికమైపోతోంటే వారి కష్టాలను పట్టించుకోకుండా, మరోవైపు ఈ మంత్రి ఇలా తన తన వ్యాపారం చూసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.