: మ్యాప్ లో భారత భౌగోళిక స్వరూపాన్ని మార్చేసిన చైనా మొబైల్ సంస్థ!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ ‘వన్ ప్లస్ 5’ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఈ ఫోన్లను ఇండియాలోని పలు స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ తమ మైబైల్ ఫోన్ ప్రచారంలో భాగంగా ప్రదర్శించిన ఓ వీడియోలో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించి విమర్శలు ఎదుర్కుంటోంది. ఆ సంస్థ న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో పాప్ అప్ ఈవెంట్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రదర్శించిన వీడియోలో భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్థాన్‌లో కలిపేసి చూపించింది. భారత భౌగోళిక స్వరూపం మారిపోయినట్లు ఆ మ్యాప్ లో స్పష్టంగా కనపడుతోంది. అయితే, దీనిపై వన్ ప్లస్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందనా లేదు.