: రజనీకాంత్ నిరక్షరాస్యుడు.. రాజకీయాలకు సరిపోడు!: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రజనీ సొంత పార్టీ పెట్టనున్నారని, ఎన్డీయేకు మద్దతుగా ఉంటారని ఆయన సన్నిహితుడు గురుమూర్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ గురించి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు రజనీకాంత్ ఏమాత్రం సరిపోడని... ఆయన నిరక్షరాస్యుడని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. స్వామి వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారాన్ని రేపే అవకాశాలు ఉన్నాయి.