: బౌలింగును శాసించేందుకే ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ పుట్టాడు: లాల్ చంద్ రాజ్ పుత్ కితాబు


క్రికెట్ ను సచిన్ టెండూల్కర్ ఎలా శాసించాడో, అలా ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ బౌలింగును శాసిస్తాడని ఒకప్పటి టీమిండియా మేనేజర్, ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ పేర్కొన్నారు. ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు ఐసీసీ టెస్టు హోదా కల్పించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, క్రికెట్‌ లో బౌలింగ్‌ విభాగాన్ని శాసించడానికే రషీద్‌ పుట్టాడని అన్నాడు. భవిష్యత్తులో రషీద్ మరిన్ని అద్భుతాలు చేస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సాధారణంగా కుడిచేతి వాటం బౌలర్‌ ని ఎదుర్కోవడం బ్యాట్స్ మెన్‌ కి సవాలు అని, అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరైన రషీద్ ను ఎదుర్కోవడం మరింత కష్టమని ఆయన తెలిపాడు. గతంలో శ్రీలంక స్పిన్ సంచలనం అజంతా మెండీస్‌ బౌలింగ్‌ ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్ మన్ ఎంత ఇబ్బందిపడేవారో రషీద్ బౌలింగ్ లో కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పాడు. మెండీస్ బౌలింగ్ ను పలువురు బ్యాట్స్ మన్ అధ్యయనం చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. కాగా, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో ఆడిన రషీద్ మెరుగైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News