: నీటి తొట్టెలో మైఖేల్ జాక్సన్ లా గంతులేసిన గొరిల్లా...వీడియో చూడండి


పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ స్ప్రింగులా శరీరాన్ని వంపులు తిప్పుతూ.. అసలు ఈయనలో ఎముకలున్నాయా? అన్నంతగా డ్యాన్సులు చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేవేగంగా డ్యాన్స్ చేస్తూ గుండ్రంగా కూడా తిరుగుతాడు. ఇంతవరకు అంత వేగంగా గుండ్రంగా తిరగడం మరోపాప్ స్టార్ కు సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు.

అయితే డల్లాస్‌ కి మూడు మైళ్ల దూరంలో ఒక జూపార్కు ఉంది. అందులో జోలా అనే పేరుగల 14 ఏళ్ల గొరిల్లా ఒకటి ఉంది. జోలా ఉన్న గదిలో జూ నిర్వాహకులు ఒక పెద్ద నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. తొట్టెలోని నీటిలో దిగిన గొరిల్లా పట్టరాని సంతోషంతో గంతులేసింది. వేగంగా నీట్లో కలియదిరుగుతూ డ్యాన్స్ చేసింది. జూన్‌ 20న 30 సెకన్ల నిడివి గల వీడియోను యూట్యూబ్‌ లో అప్ లోడ్ చేయగా, దానిని సుమారు 7 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News