: ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్ చేయండి... 2 లక్షలు గెలుచుకోండి: గర్భిణులకు ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ గర్భిణులకు బంపర్ ఆఫర్ ఇస్తూ సంచలన నిర్ణయానికి తెరతీశారు. అసుపత్రుల్లో కాసుల కక్కూర్తితో జరుగుతున్న భ్రూణహత్యలు నివారించేందుకు సరికొత్త పథకం ప్రకటించారు. లింగనిర్ధారణ పరీక్షలు జరిపే ఆసుపత్రులు, లేదా కేంద్రాల సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల భారీ నగదు బహుమతినిస్తామని ప్రకటించారు. జూలై 1 నుంచి అమలు కానున్న ఈ సరికొత్త పథకంలో బహుమతి నజరానా మూడు దఫాలుగా అందించనున్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోగానే లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.

ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతం కాగానే అందిస్తారు. కేవలం సమాచారం అందిస్తే 60 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని విచారణ సందర్భంగా సాక్ష్యం చెప్పిన తరువాత ఇస్తారు. గర్భిణీకి తోడుగా వెళ్లినవారికి 40 వేల రూపాయలు అందించనున్నారు.  ఈ మొత్తం శిక్షపడ్డ తరువాత అందించనున్నారు. యూపీలో ప్రతి 1000 మంది బాలురకు 902 మంది యువతులే అందుబాటులో ఉన్నారని, భ్రూణహత్యల కారణంగా ఈ అంతరం మరింత పెరుగుతోందని, ఇప్పుడీ కార్యక్రమం ద్వారా దీనిని నివారించవచ్చని సీఎం వ్యూహం రచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆరోగ్యశాఖాధికారులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ద్వివేది లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News